పటాన్చెరు డివిజన్ పరిధిలోని కృషి డిఫెన్స్ కాలనీలో డిఫెన్స్ సివిలియన్ ఆఫీసర్స్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాలనీ అధ్యక్షులు అమరేందర్, బలవంత్, శ్రీరాములు పాల్గొన్నారు.