భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్ చెరులోని మైత్రి మైదానంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఏక్తా దివత్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐ వినాయక్ రెడ్డి, మైత్రి క్లబ్ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు.