పటాన్ చెరు: బిజెపిలో మహిళల చేరిక

పటాన్ చెరు మండలం క్యాసం గ్రామానికి చెందిన యువకులు, మహిళలు బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరారు. బీజేపీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆమె స్వాగతం పలికారు. కేంద్ర ప్రభుత్వ పాలన చూసి మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని గోదావరి అంజిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సుధాకర్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్