పటాన్‌చెరు: బీజేపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో బీజేపీ నాయకులు గురువారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. జిన్నారం మండలాన్ని మున్సిపాలిటీగా మార్చొద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం జిన్నారం ఎమ్మార్వో బిక్షపతికి వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్