గుమ్మడిదల రైతులకు సౌర విద్యుతపై అవగాహన

కానుకుంట రైతువేదికలో రైతు వారోత్సవాల సందర్భంగా 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక'పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వ్యవసాయ క్షేత్రాల్లో సౌర విద్యుత్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను ఎలక్ట్రికల్ AE రవీందర్ వివరించారు. వ్యవసాయ పరికరాలు, వాటిపై లభించే సబ్సిడీల గురించి AO శ్రీనివాసరావు రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, సర్పంచులు, అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్