రామచంద్రపురం లో నిర్వహించిన సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో బీజేపీ జెండా ఎగరవేసేలా కృషి చేయాలని ఆమె కోరారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆమె పేర్కొన్నారు.