ఘనంగా రేణుక ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవం

కంది మండలం చర్లగూడెం గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీ భూమయ్య, పిఎసిఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ రమేష్, ఆలయ కమిటీ అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్