గుమ్మడిదల రైతులకు న్యాయం చేయాలని వినతి

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రావీణ్యకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. గ్రామంలోని 109 సర్వే నెంబర్లలో పరిశ్రమల కోసం రైతులు 160 ఎకరాలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఒక్కో లబ్ధిదారునికి 100 గజాల ప్లాట్ కేటాయించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్