పటాన్చెరు రామమందిరంలో హోలీ, ఉగాది, శ్రీరామనవమి పండుగల తేదీల నిర్ణయానికి జరిగిన సమావేశంలో మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు అభివృద్ధి వేగంగా జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. శ్రీరామనవమి వేడుకలకు రూ. 1, 51, 000 ఆర్థిక సహాయం ప్రకటించి, సంప్రదాయాలను ఐక్యంగా కొనసాగిస్తామని తెలిపారు. 'సంప్రదాయం మన బలం – ఐక్యత మన శక్తి' అని ఆయన పిలుపునిచ్చారు.