సదాశివపేట పట్టణంలోని గొల్లగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న, గొల్లగూడెం సర్పంచ్ సుజాత పాల్గొన్నారు.