సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ అధ్యక్షతన, పటాన్‌చెరు నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ నాయకులతో ఆమె నివాసంలో ప్రత్యేక సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాట సుధా మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని, అందుకు గ్రామ, మండల, బ్లాక్ స్థాయిల్లో మహిళా కాంగ్రెస్ కమిటీలను వేగంగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.