జిన్నారం ఎంపీడీవో కి వినతి పత్రం అందజేత

జిన్నారం మండల కేంద్రంలో బీజేపీ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. గురువారం జిన్నారం మండల బీజేపీ అధ్యక్షుడు కొత్త కాపు జగన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. జిన్నారం మండలాన్ని మున్సిపాలిటీలో కలపవద్దని ఎంపీడీవో అరుణాకి వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ వద్దు గ్రామపంచాయతీ ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్