సంగారెడ్డి: రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని కొడకంచి - మాదారం వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారింది. కంకర తేలిన రోడ్డుతో స్థానిక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతలు పడిన రోడ్లపై ప్రమాదాలు జరుగుతాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానిక గ్రామస్తులు, వాహనదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్