వెలిమెల నోబుల్ స్కూల్ ఉపాధ్యాయురాలు జమీలకు ఉత్తమ అవార్డు

సంగారెడ్డి జిల్లా, ప‌టాన్‌చెరు నియోజకవర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు వెలిమెల నోబుల్ స్కూల్ పాఠశాల ఉపాధ్యాయురాలు జమీల గురువారం ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు సింహాచలం, తోటి ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. నూతన బోధనా పద్ధతులతో సృజనాత్మకతను జోడిస్తూ విద్యార్థుల ప్రగతికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ఆమె సేవలకు ఈ గుర్తింపు దక్కడం పాఠశాలకు గర్వకారణమని తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕