పటాన్చెరు తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

పాశ మైలారం పరిధిలోని బిస్లరి కార్మికుల సమ్మెకు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశం శనివారం మద్దతు తెలిపారు. అక్రమంగా విధుల నుంచి తొలగించిన కార్మికులను వెంటనే తిరిగి తీసుకోవాలని ఆయన యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. యాజమాన్యం మొండివైఖరిని వీడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యం, కార్యదర్శి సాయిలు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్