ఆర్టీసీ ప్రయాణికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త అందించారు. వచ్చే వారం రోజుల్లో మహిళా సమాఖ్యల ద్వారా 350 కొత్త బస్సులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ బస్సులను మహిళా సమాఖ్యల ద్వారా కొనుగోలు చేసి, ఆర్టీసీకి అద్దెకు పెట్టి, మహిళలకు ఆర్థిక మద్దతు అందిస్తామని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతి మండలానికి ఒక బస్సు అదనంగా కేటాయిస్తామని, మహా లక్ష్మీ పథకం కారణంగా పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచుతున్నామని తెలిపారు.