సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని మెటల్ క్రాఫ్ట్ లిమిటెడ్ కంపెనీలో మంగళవారం 55వ నేషనల్ సేఫ్టీ డేను ఘనంగా నిర్వహించారు. హోలీ పండుగ సెలవు కారణంగా మార్చి 4న జరగాల్సిన ఈ వేడుకలను ముందుగానే మంగళవారం రోజున జరుపుకున్నారు. డైరెక్టర్ ప్రతాప్ రాజ్ జెండా ఆవిష్కరించి, భద్రతా ప్రమాణాల ప్రాముఖ్యతను తెలియజేశారు. ఉద్యోగులు, కార్మికులు కలిసి భద్రతా ప్రమాణాలు పాటించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్లు, సీనియర్ స్టాఫ్, ఇంజనీర్లు, జూనియర్ స్టాఫ్, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.