సంగారెడ్డి జిల్లా ఫసల్వాడిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో పీఠాధిపతి మహేశ్వర శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో శనివారం ఆరుద్రాష్టమి వ్రత క్రతువు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. అరుద్రాష్టమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, 2700 మంది మహిళలతో సామూహిక వ్రతాన్ని నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.