స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని పార్టీలు సహకరించాలి

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రావిణ్య విజ్ఞప్తి చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఇప్పటికే జడ్పిటిసి, ఎంపీటీసీ రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్