సంగారెడ్డి ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అనంత కిషన్

ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సంగారెడ్డి పట్టణానికి చెందిన తోపాజి అనంత కిషన్ నియమితులయ్యారు. హైదరాబాద్ లోని సంఘ భవనంలో రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఆదివారం నియమక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అనంత కిషన్ మాట్లాడుతూ సంఘం బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ నియామకం సంఘ కార్యకలాపాలకు మరింత ఊపునిస్తుందని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్