బిసి గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ఉమ్మడి మెదక్ జిల్లాలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 10వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు రిజినల్ కోఆర్డినేటర్ రాజేశం తెలిపారు. ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డి, మెదక్, వర్గల్ ప్రాంతాలలో డిగ్రీ కళాశాలలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు http://mjptbcwreis.cgg.gov.in వెబ్‌సైట్‌లో రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్