సంగారెడ్డి హౌస్ వైరింగ్ లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

సంగారెడ్డిలోని ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో పురుషులకు హౌస్ వైరింగ్ లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. సంగారెడ్డి, మెదక్ గ్రామీణ ప్రాంతాలకు చెందిన 19-40 ఏళ్ల అభ్యర్థులు అర్హులు. ఎంపికైన వారికి ఉచిత భోజనం, వసతి కల్పిస్తారు. ఆసక్తి గలవారు అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్