సంగారెడ్డిలో భగత్ సింగ్ జయంతి వేడుకలు

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి సోమవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫోరమ్ అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలకు తెగించి పోరాడారని, ఆయన స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕