ఆషాడ మాసం సందర్భంగా సదాశివపేట పట్టణంలో శనివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీ నిర్వహిస్తూ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. అనంతరం దుర్గా భవాని అమ్మవారి ఆలయంలో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.