సదాశివపేట పట్టణంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో బోనాల వేడుకలు శుక్రవారం నిర్వహించారు. మహిళలు తలపై భవనాలను ధరించి పట్టణ పురవీధుల మీదుగా ఊరేగింపుగా వెళ్లి దుర్గాభవాని అమ్మవారికి సమర్పించారు. అనంతరం దుర్గాభవాని అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను జరిపించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.