సంగారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థి శిరీష ఇంటింటి ప్రచారం

సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. శుక్రవారం, స్థానిక 9వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శిరీష బాలు యాదవ్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారంలో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శిరిష ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి, కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచారం 9వ వార్డులో జోరుగా సాగింది.

సంబంధిత పోస్ట్