పాఠశాలలో స్కూటీకి ఛార్జింగ్.. ఉపాధ్యాయుడిపై ఆగ్రహం

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని ఖమ్మంపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఓ హిందీ పండిట్, పాఠాలు బోధించే ముందు తన ఎలక్ట్రిక్ స్కూటీని పాఠశాల స్విచ్ బోర్డులో ఛార్జింగ్ పెడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇంట్లో ఛార్జింగ్ పెడితే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నారని, దీనివల్ల పాఠశాల కరెంట్ బిల్లు పెరిగిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై గ్రామపంచాయతీ, విద్యాశాఖ అధికారులు స్పందించి, పాఠశాల వనరులను వ్యక్తిగత అవసరాలకు వాడుకోకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్