బాలల భద్రత, డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాలు ప్రారంభం

సంగారెడ్డి జిల్లాలో “బాలల భద్రత – డ్రగ్స్ రహిత తెలంగాణ” వారోత్సవాలు మే 2 వరకు కొనసాగుతాయి. అదనపు కలెక్టర్ పాండు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని 8 చైల్డ్ కేర్ సంస్థల పిల్లలకు జనన, ఆధార్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, బ్యాంక్ ఖాతాలు ఏర్పాటు చేస్తున్నారు. 18 ఏళ్లు పూర్తయిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పిల్లలకు అవసరమైన అన్ని సదుపాయాలు అందిస్తున్నామని జిల్లా సంక్షేమ అధికారిణి లలిత కుమారి తెలిపారు.

సంబంధిత పోస్ట్