పదో తరగతి ఫలితాలు: తల్లిదండ్రులకు యస్ఐ సూచనలు

సంగారెడ్డి జిల్లాలో పదో తరగతి ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో, విద్యార్థుల తల్లిదండ్రులు సంయమనంతో వ్యవహరించాలని రూరల్ యస్ఐ సూచించారు. ఫలితాలు ఎలా ఉన్నా పిల్లలను ప్రేమగా అక్కున చేర్చుకోవాలని, తక్కువ మార్కులు వచ్చినా లేదా ఫెయిల్ అయినా వారిని దండించడం, నిందించడం చేయవద్దని ఆయన తెలిపారు. ఇది వారి పదేళ్ల విద్యా ప్రయాణంలో ఒక చిన్న మలుపు మాత్రమేనని, జీవితానికి చివరి పరీక్ష కాదని తల్లిదండ్రులు గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. పిల్లలకు అండగా నిలవాలని యస్ఐ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్