సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న పార్కులో శనివారం విద్యానగర్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్కులను శుభ్రం చేసి, పిచ్చి మొక్కలను తొలగించారు. వెంకటేశ్వర్లు, అల్లం రెడ్డి, విప్లవ రెడ్డి, సంగమేశ్వర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.