సంగారెడ్డిలో మంగళవారం రైతు వేదిక వద్ద సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల ప్రత్యక్ష ప్రసారాన్ని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి తిలకించారు. రైతుల కోసం ప్రభుత్వం ఎకరానికి 6000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తుందని, రైతులు పంటల సాగుకు సిద్ధం కావాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ పాల్గొన్నారు.