సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండలంలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాణిక్ రావు పాటిల్ ఆధ్వర్యంలో ఎస్సైగా నూతన బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణను గురువారం ఘనంగా సన్మానించడం జరిగింది. శాంతి భద్రతలు, ప్రజల అవసరాలు తీర్చడంలో ఎల్లవేళల సహకరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంజీవరావు పాటిల్, మనోహర్ రావు పాటిల్, బస్వారాజ్ నాగపూరే, సోపాన్ రావు పాటిల్, జంగం బస్వారాజ్, విజయ్ కుమార్ గాడ్డే, నారసింగ్ రావు పాటిల్ రూప్ సింగ్, కంగ్టి వైజీనాథ్, సోమిదాస్, తదితరులు పాల్గొన్నారు.