సంగారెడ్డి శ్రీ వైకుంఠపురంలో ధనుర్మాస వేడుకలు

సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠపురంలో ధనుర్మాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం దేవాలయ ప్రధాన అర్చకులు వరదా చార్యుల ఆధ్వర్యంలో గోదాదేవి అమ్మవారికి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ఆలయ పురవీధుల మీదుగా ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున 'జై శ్రీమన్నారాయణ' అంటూ నామస్మరణ చేశారు.

సంబంధిత పోస్ట్