సంగారెడ్డి పట్టణంలోని మంజీర నగర్ లో ధన్వంతరి నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఆదివారం పుస్తకాలను పంపిణీ చేశారు. సాయి పేట మోహన్ సహకారంతో పుస్తకాలను పంపిణీ చేసినట్లు జిల్లా అధ్యక్షుడు నాగభూషణం తెలిపారు. పట్టణ అధ్యక్షుడు మాణిక్య ప్రభు, ఉపాధ్యక్షుడు వీరన్న, సభ్యులు పాల్గొన్నారు.