కొండాపూర్ మండలంలో బుధవారం రూ. 5.75 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు ఈ నిధి ఎంతో ఉపయుక్తంగా ఉందని నాయకులు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.