ముగ్ధంపల్లిలో ఓటర్ ఫామ్‌ల పంపిణీ

సంగారెడ్డి నియోజకవర్గంలోని ముగ్ధంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు రసూల్ పటేల్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు SIR ఓటర్ ఫామ్‌లు పంపిణీ చేసి గురువారం అవగాహన కల్పించారు. ఫామ్‌లకు సంబంధించిన సందేహాలుంటే బీ.ఎల్‌.వోలను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నర్సింలు, వీఆర్వో రాజు, బీ.ఎల్‌.వో సరళ, బీ.ఎల్‌.ఎ యెంపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అధికారులు ఫామ్‌లను సక్రమంగా నింపి గడువులోగా సమర్పించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్