సంగారెడ్డి: ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట పిఎసిఎస్ కార్యాలయ ఆవరణలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం సగం మందికి చేసి చేతులు దులుపుకుందని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్