మాజీ కౌన్సిలర్ నర్సింలు, తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, సంగారెడ్డి మున్సిపాలిటీపై మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరవేయడానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు.