సదాశివపేట బీజేపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా గణపురం చంద్రశేఖర్ నియామకం

సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట పట్టణ బీజేపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా గణపురం చంద్రశేఖర్ ఆదివారం నియమితులయ్యారు. పట్టణ కార్యదర్శులుగా లొంక హరి, అవుసలి సుధాకర్ లను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు కోణం విట్టల్ ప్రకటన విడుదల చేశారు. పార్టీ బలోపేతంతో పాటు ఓబీసీ వర్గాల సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. తనపై నమ్మకం ఉంచి అధ్యక్షుడిగా నియమించినందుకు పార్టీ పెద్దలకు, నాయకులకు చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕