సంగారెడ్డి: ఘనంగా హనుమాన్ దేవాలయం వార్షికోత్సవం

సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి పరిధిలోని బాలాజీ సాయిరాం కాలనీలో హనుమాన్ దేవాలయం వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో హనుమంతునికి, శివలింగానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు చేశారు. గణపతి హోమ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో జరిపించారు. అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, కార్యదర్శి అంబయ్య, వైస్ ప్రెసిడెంట్ గోపాల్, ఆర్గనైగింగ్ సెక్రటరీ సుగుణాకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్