శుక్రవారం కందిలో ఎక్సైజ్ అధికారులు 10 లక్షల విలువైన 946 గ్రాముల హషిష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి నుంచి తయారుచేసిన ఈ హషిష్ ఆయిల్‌ను అక్రమంగా హైదరాబాద్‌కు తరలిస్తుండగా అనిల్ కుమార్ అనే వ్యక్తిని అధికారులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని ఎక్సైజ్ సూపరింటెండ్ శ్రీనివాసరావు తెలిపారు.