మాజీ మంత్రి హరీష్ రావు మంగళవారం కందిలో మాట్లాడుతూ, కొందరు ఐపీఎస్ అధికారులు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, రేవంత్ రెడ్డి మిమ్మల్ని కాపాడలేడని ఆయన అన్నారు. రిటర్న్ అయిన తర్వాత కూడా హ్యాకింగ్ చేసే అధికారులను వదిలిపెట్టమని ఆయన పేర్కొన్నారు.