టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై వస్తున్న నిరాధార సోషల్ మీడియా కథనాలను తీవ్రంగా ఖండించారు. ఎదుటివారిపై బురదజల్లే సంప్రదాయం మంచిది కాదని, దురుద్దేశపూర్వకంగా ఇలాంటి వార్తలు రాయడాన్ని ప్రోత్సహించడం తప్పు అని ఆయన అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో రాయమని ప్రేరేపించేవారిది అతి పెద్ద తప్పు అని, అలాంటి వారికి బుద్ధి లేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు.