17న సంగారెడ్డిలో జాబ్ మేళా

సంగారెడ్డి లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 17వ తేదీన ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి అనిల్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేందుకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పది నుంచి ఎంబీఏ చదివిన వారు అర్హులని చెప్పారు. 22 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలని తెలిపారు. ఆసక్తి గలవారు జాబ్ మేళాలకు హాజరు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్