జోగిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వాహనదారులతో జాతీయ భద్రత ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై పాండు మాట్లాడుతూ, వాహనదారులు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు నెల రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.