సంగారెడ్డిలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ మైదానంలో ఆదివారం ఉమ్మడి మెదక్ జిల్లా అండర్ 19 బాస్కెట్ బాల్ పోటీలు జరిగాయి. మూడు జిల్లాల నుంచి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబరిచారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని బాస్కెట్ బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియ ద్వారా యువ క్రీడాకారులకు ప్రోత్సాహం లభించనుంది.