సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య జ్యోతి ప్రజ్వలన చేసి బుధవారం ప్రారంభించారు. గత నెల 30వ తేదీన నిర్వహించిన దివ్యాంగుల క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, జిల్లా యువజన శాఖ అధికారి ఖాసీం భేగ్ పాల్గొన్నారు.