సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో కలరియ పట్టు ముగింపు శిక్షణ కార్యక్రమం శుక్రవారం రాత్రి నిర్వహించారు. టీజీఐఐటి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ విద్యాపీఠం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు.