కంది మండలం కాశీపూర్ గ్రామ పరిధిలోని దుల్ సాబ్ నాల్ పీర్లను గురువారం అర్ధరాత్రి కాలిపోయాయి. శుక్రవారం ఉదయం చూసేసరికి పీర్లు కాలిపోయి ఉండడంతో ఇంద్రకరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై విజయ్ కుమార్ పాల్గొన్నారు.