కంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ప్రావీణ్య గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడికి వచ్చిన రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్యులు పాల్గొన్నారు.